తూర్పు గోదావరి జిల్లాలోని చెయ్యేరు వడ్డిపేటలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దారి విషయమై ఈ నెల 10న జరిగిన ఘర్షణలో తలకు తీవ్రగాయమై అమలాపురంలోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్న యాళ్ల అర్జునరావు(45) శనివారం మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకొచ్చారు. వివాదానికి, అర్జునరావు చనిపోవడానికి స్థానిక నాయకుడు సూరిబాబు కారణమని బాధితులు ఆందోళన చేశారు. అతన్ని అరెస్టు చేస్తేనే మృతదేహానికి ఖననం చేస్తామని పట్టుబట్టారు. దీంతో అమలాపురం పట్టణం, ముమ్మిడివరం, రాజోలు సీఐలు సురేష్‌బాబు, బి.రాజశేఖర్, దుర్గాశేఖర్‌రెడ్డి, అల్లవరం, అంబాజీపేట, కొత్తపేట, పి.గన్నవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన ఎస్సైలు గ్రామంలో బందోబస్తు నిర్వహించి, పరిస్థితిని చక్కదిద్దారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచి, రాత్రి ఏడుగంటల సమయంతో తరలించారు. మృతుని కుటుంబాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించి, కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు.
అరెస్టు చేస్తేనే.. మృతదేహానికి ఖననం - etv bharat telugu updates
తూర్పుగోదావరి జిల్లాలోని చెయ్యేరు వడ్డిపేటలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దారి విషయమై ఈ నెల 10 జరిగిన ఘర్షణలో గాయపడిన యాళ్ల అర్జునరావు కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివాదానికి, అర్జునరావు చనిపోవడానికి స్థానిక నాయకుడు సూరిబాబు కారణమని బాధితులు ఆందోళన చేపట్టగా... పోలీసులు బందోబస్తు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు.
మృతుని కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న మాజీ ఎంపీ హర్షకుమార్