రాజమహేంద్రవరంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులతో పాటు సంజీవని బస్సుల వద్ద కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. జాంపేట వద్ద సోమవారం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపినప్పటికీ మధ్యాహ్నం వరకు వైద్య సిబ్బంది పరీక్షలు ప్రారంభించలేదు. ఓ వైపు వర్షం కురవటంతో జనం అక్కడే ఉండిపోయారు.
కరోనా పరీక్షల కోసం సంజీవని బస్సుల వద్ద ఎదురుచూపులు - corona news rajamahendravaram
తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ కేసులు విస్తృతంగా పెరగటంతో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సంజీవని బస్సుల వద్ద పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవటంతో ఆసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు
కరోనా పరీక్షల కోసం సంజీవని బస్సుల వద్ద ఎదురుచూపులు
ఎంతసేపటికి సిబ్బంది రాకపోవటంతో కొంతమంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఆదివారం రాజమహేంద్రవరం, కాకినాడల్లో పరీక్షలు చేస్తామని చెప్పినా సంజీవని బస్సుల వద్ద పరీక్షలు చేయలేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.