కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆదివారం కావటంతో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మాంసం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్లు గీసి అందులో కొనుగోలుదారులు నిలబడేలా అవగాహన కల్పించాలని దుకాణ యజమానులకు చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ప్రమాదకరంగా గుమిగూడినా అక్కడ పట్టించుకునే వారు ఎవరూ లేరు.
బాధ్యతారాహిత్యం.... మాంసం కోసం గుమిగూడిన జనం - ఏపీలో కరోనా కేసులు
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే సామాజిక దూరం పాటించాలని ఓ పక్క ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నా కొంతమందిలో అవగాహన రావటం లేదు. మార్కెట్ల వద్ద నిర్లక్ష్యంగా గుమిగూడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మాంసం కోసం దుకాణాల వద్ద ప్రజలు ప్రమాదకరంగా గుమిగూడారు.
social distance