మా సమస్యను తీర్చండి సారు...! - dumping yard at rajamahendravaram news
రాజమహేంద్రవరంలోని లూథరన్ గిరి వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల రోగాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ వల్ల పిల్లలు అస్వస్థకు గురవుతున్నారని వాపోయారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డంపింగ్ యార్డ్ సమస్యతో బాధపడుతున్న స్థానికులు
డంపింగ్ యార్డ్ సమస్యతో బాధపడుతున్న స్థానికులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లూథరన్ గిరి వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసన, అది కాలిపోయినప్పుడు వచ్చే పొగతో రోగాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెడుతున్నారని వాపోయారు. వీరి సమస్యను తెలుసుకున్న స్థానిక తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు వచ్చి బాధితులకు మద్దతుగా నిలిచారు. కార్పొరేషన్ అధికారులను పిలిపించి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.