ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండుటెండలో బ్యాంకుల ముందు పడిగాపులు - బ్యాంకుల ముందు ప్రజల అవస్థలు న్యూస్

భానుడు భగభగలాడుతున్నాడు. లాక్​డౌన్​తో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాయి. ఈ నగదు తీసుకునేందుకు ప్రజలు మండుటెండలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని ప్రధాన బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు.

మండుటెండలో... బ్యాంకుల ముందు పడిగాపులు
మండుటెండలో... బ్యాంకుల ముందు పడిగాపులు

By

Published : May 27, 2020, 4:14 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని ప్రధాన బ్యాంకుల వద్ద ఖాతాదారులు నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకులో నగదు తీసుకునేందుకు నిబంధనలను అనుసరించి నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారంతా మండుటెండలో బ్యాంకు ముందు నిలబడి ఉంటున్నారు. లోపలికి వెళ్లిన వ్యక్తి బయటకు రావడానికి పదిహేను, ఇరవై నిమిషాలు పడుతుండగా, మిగతా వారంతా భౌతికదూరం పాటిస్తూ గంటల తరబడి బ్యాంకు బయట ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

కొన్నిచోట్ల షామియానా వేసినా అది కొందరికి మాత్రమే నీడనిస్తుంది. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడంతో పాటు ఖాతాదారులకు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు బ్యాంకు అధికారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి :ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తే తెలుగును అవమానపరిచినట్లా: జగన్

ABOUT THE AUTHOR

...view details