ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేనూ.. పెన్షన్​ దారుణ్నే.. నాకు పెన్షన్​ వచ్చేది..! - పెన్షన్ దారులు తాజా వార్తలు

కొండ నాలుకకు మందేస్తే... ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఉంది వైకాపా ప్రభుత్వ తీరు.. అంటున్నారు పెన్షన్​ దారులు. ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తామన్న వైకాపా ప్రభుత్వం.. మొత్తానికి పెన్షన్లు నిలిపివేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో ఏకంగా 900 మందికి పైగా పెన్షన్లు నిలిచిపోవడంతో ఆందోళనకు దిగారు.

Pensioners are prosted for their pensions
పెన్షన్ ఆందోళన నిర్వహిస్తున్న పింఛన్ దారులు

By

Published : Feb 3, 2020, 2:53 PM IST

కిర్లంపూడిలో పెన్షన్ దారులు ఆందోళన

ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇస్తామన్న ప్రభుత్వం.. మొత్తానికే పెన్షన్​ ఇవ్వకుండా నిలిపివేయడంతో పెన్షన్ దారులు ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో 900 మందికి పైగా పెన్షన్లు నిలిచిపోయాయి. మండలంలో ఏలంక గ్రామానికి చెందిన 456 మందికి పెన్షన్లు తొలగించారు. దీంతో పెన్షన్​ దారులంతా మండల కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కృష్ణవరం, సోమవరం, సింహాద్రిపురం గ్రామాలకు చెందిన పెన్షన్ దారులు ఎంపీడీవోని నిలదీశారు. సాంకేతిక సమస్యలు కారణంగా నిలిచిపోయాయని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు. అయితే సాంకేతిక సమస్యలు వస్తే అందరికి పెన్షన్​ ఆగిపోవాలి కదా..? కొందరికి మాత్రమే ఆగిపోవడమేంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్​దారులకు మద్దతుగా పెద్ద ఎత్తున టీడీపి శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details