భుజంపై కన్నకూతురుని మోసుకుని వెళ్తున్న ఈ తల్లిది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గొడారిగుంట ప్రాంతం. కుమార్తె జోత్స్నభవానికి 16 ఏళ్లు వచ్చినా బుద్ధిమాంద్యం కారణంగా పసిపాపలాగే ప్రవర్తిస్తోంది. ఆమెకు తల్లి పద్మావతే అన్నీ తానై చూసుకుంటోంది. తండ్రి కూలి పనికి వెళ్తేనే వారికి పూట గడుస్తుంది. అప్పులు చేసి, చిన్నారిని బతికించుకుంటున్నామని వాపోయారు.
బాలికకు అయిదేళ్లుగా వస్తున్న వికలాంగ పింఛను ఇటీవల అనూహ్యంగా నిలిచిపోయింది. విద్యుత్తు బిల్లు ఎక్కువ వచ్చిందన్న కారణంగా ఆపేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఎటూ దిక్కుతోచని స్థితిలో సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తమ గోడు వెళ్లబోసుకున్న పద్మావతి.. పింఛను పునరుద్ధరించి ఆదుకోవాలంటూ వేడుకున్నారు.