లాక్డౌన్ సడలింపు తెలియగానే తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆటోలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. పరిస్థితి గమనించిన పోలీసులు ఆటోలకు అపరాధ రుసుములు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు చేస్తున్న వారికే జరిమానాలు వేస్తున్నామని చెప్పారు.
అయితే లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఉందని ఆటోవాలాలు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ అపరాధ రుసుములు విధించడం సరైనది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.