తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చరిత్ర కథలు, గాధలు వివరిస్తూ వంగళపూడి శివకృష్ణ అనే యువకుడు పుస్తకం రచించాడు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు సాహితీ వేత్తలు, కవులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. పెద్దాపురం అనే పేరు ఎలా వచ్చింది..? పట్టణ విశిష్టత, వివిధ రాజుల పాలన, యుద్ధాలు, గ్రామానికి చెందిన కవులు, జాతీయోధ్యమ నాయకులు వంటి అనేక అంశాలకు ఈ పుస్తకంలో పొందుపరిచారు.
పెద్దాపురం పట్టణ చరిత్రను తెలిపేలా పుస్తకం..! - Peddapur is a young man who wrote a book on urban history
పెద్దాపురం చరిత్ర కథలు, కవులు, పట్టణ విశిష్టత, వివిధ రాజుల పాలన, యుద్ధాలను వివరిస్తూ... శివకృష్ణ అనే యువకుడు పుస్తకం రచించాడు.
పెద్దాపురం పట్టణ చరిత్ర పుస్తకం
160 పేజిలు గల ఈ పుస్తకంలో చిత్రాలను జాతీయస్థాయిలో చిత్ర కళాకారుడుగా అవార్డులు పొందిన సింగం పల్లి సత్యనారాయణ, రాష్ట్ర స్థాయిలో గుర్తిపుపొందిన హరి, వర్ధమాన చిత్రకారుడు శ్యాం గీశారు. సాహిత్య పరమైన చరిత్ర వాస్తవాలకు దూరంగా ఉంటుందన్నారు. అత్యంత సరళమైన భాషలో వాస్తవ కథనాలతో రాసిన చరిత్ర గుర్తింపు పొందుతుందని ఆర్డీవో మల్లిబాబు పేర్కొన్నారు.