అభిమానుల ఆనందోత్సాహాల మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. దివిస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా తరలివచ్చిన పవన్‌కు.. అన్నవరంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడినుంచి అభిమానులతో కలిసి రోడ్‌షో నిర్వహిస్తూ.. కొత్తపాకల చేరుకున్నారు. దారిలో అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు వెళ్లారు. కొత్తపాకలలో దివిస్ పరిశ్రమ బాధితులను పవన్ పరామర్శించారు.