ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PAWANKALYAN TOUR: పవన్​కల్యాణ్ పర్యటనపై కొనసాగుతోన్న సందిగ్ధం..

నేడు తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో పవన్‌కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. దెబ్బతిన్న దారుల్లో జనసేనాని శ్రమదానం కార్యక్రమం, బహిరంగ సభలకు జనసేన అధినేత హాజరుకానున్నారు. అయితే శ్రమదానానికి, బహిరంగ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

pawan-kalyan-tour-in-east-godavari-and-anantapur-districts-today
పవన్​కల్యాణ్ పర్యటనపై కొనసాగుతోన్న సందిగ్ధం

By

Published : Oct 2, 2021, 8:22 AM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. దెబ్బతిన్న రహదారుల్లో జనసేనాని శ్రమదానం కార్యక్రమం, బహిరంగసభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజమహేంద్రవరం వస్తున్నారు. శ్రమదానం, బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ ఆంక్షల కారణంగా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున.. ఐదురురుకి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. జనసేన నాయకుల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు.

ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని మూసేసిన పోలీసులు.. రాజమహేంద్రవరానికి వచ్చే అన్ని మార్గాల్లోనూ మోహరించారు. కీలక దారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ జనసేన పార్టీ శ్రేణుల్ని అడ్డుకుంటున్నారు. పవన్‌ సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరతామని.. తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ప్రకటించడంతో.. ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని పోలీసుల హెచ్చరించారు.

ఇదీ చూడండి: Jagananna Swachha Sankalpam: బెజవాడలో 'జగనన్న స్వచ్ఛ సంకల్పం'.. ట్రాఫిక్ ఆంక్ష‌లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details