రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మరోసారి నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నామినేషన్ల ప్రక్రియలో హింస, దౌర్జన్యాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వానికి కొమ్ముకాసేలా ఎన్నికల సంఘం వైఖరి ఉందని మండిపడ్డారు. ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని పవన్ కోరారు. లేకుంటే న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన పవన్...రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింస, దౌర్జన్యాలపై నివేదికలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. వీటిపై ఆధారాలతో కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. అధికారులపై నివేదిక తయారుచేసి దిల్లీ వెళ్లి సీఈసీకి అందిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ మరోసారి నిర్వహించాలి: పవన్
నామినేషన్ల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రక్రియ మరోసారి నిర్వహించాలని కోరారు. అలాగే ఎన్నికల అధికారులు, పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. అవినీతి చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
pawan kalyan latest look