ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్... మాట నిలబెట్టుకోండి: పవన్ - దివీస్ పరిశ్రమపై జనసేన అధినేత పవన్ కామెంట్స్

కాలుష్య పరిశ్రమలు తీసుకొస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన..సామాజిక ప్రభావం అంచనా వేయకుండా దివీస్ పరిశ్రమలకు భూములు ఇస్తారా? అని నిలదీశారు. వైకాపాకు చెందిన రాంకీ ద్వారా అంచనా వేయించారని.. దివీస్ పరిశ్రమ కాలుష్యం మత్స్య సంపదకు, ప్రజలకు ఎలాంటి హాని జరగదని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

pawan kalayan comments over divis at eastgodawari
లాభాల వేటలో పేద ప్రజలను రోడ్డుపైకి తీసుకొస్తారా ?

By

Published : Jan 9, 2021, 6:28 PM IST

Updated : Jan 10, 2021, 4:23 AM IST

పదవిలోకి రాక ముందు దివీస్‌ అనే కాలుష్యం వెదజల్లే పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే మీరే అనుమతులిస్తే ఏం విలువలున్నట్లు? ఎలాంటి వ్యవస్థను నడపాలనుకుంటున్నారు? పర్యావరణాన్ని రక్షించే, అభివృద్ధి ప్రస్థానం ఉండేే పరిశ్రమలు రావాలి. ప్రజలకు అండగా నిలవాలి. పారిశ్రామిక ప్రగతిని నేనూ కోరుకుంటున్నా. కాలుష్యాన్ని సముద్ర జలాల్లో వదిలేస్తాం.. ఊళ్లో కలిపేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేం. పరిశ్రమను పెట్టి 54 లక్షల కిలోలీటర్ల వ్యర్థ జలాలు సముద్రంలోకి వెళ్తే అందులోని జీవాలు చనిపోతాయి. కాలుష్యం ప్రాణాలను తీసేస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రజల కన్నీళ్లపై ఎదగాలనుకోవడం సరికాదు. లాభాల వేటలో ఇంతమందిని రోడ్డుకీడుస్తారా?

మేము తెలుగు చదువుకోలేదా? వీధి బడుల్లో చదువుకోలేదా? వైకాపా నాయకులు మాట్లాడిన మాటలు మాకు రావా? మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. వారు ఏ సంస్కారాన్ని నేర్చారో తెలియదు. కాకినాడ వైకాపా ఎమ్మెల్యే నన్ను ఎలా దూషించారో మీకు తెలుసు. తిరిగి మాటనడానికి ఎంతసేపు? రోడ్ల మీదకు రాలేమా? ఎదురుదాడికి దిగలేమా? వైకాపా నాయకుల్లా మాటలు తూలను. జగన్‌రెడ్డిని కూడా గౌరవ ముఖ్యమంత్రి అని పిలుస్తా..

- తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకలు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

చ్చని పల్లెల్లోకి కాలుష్య పరిశ్రమలను తీసుకొస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో దివీస్‌ ఫార్మా పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బాధితులను శనివారం ఆయన పరామర్శించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశాక సభలో మాట్లాడారు. సామాజిక ప్రభావం అంచనా వేయకుండా దివీస్‌ వంటి పరిశ్రమలకు ఎలా అనుమతులిస్తారని ప్రశ్నించారు. పిల్లికి ఎలుక సాక్ష్యంలా వైకాపాకు చెందిన రాంకీ సంస్థ ద్వారా అంచనా వేయించారని ఎద్దేవా చేశారు. దివీస్‌ కాలుష్యంతో మత్స్య సంపదకు, ప్రజలకు నష్టం జరగబోదని ప్రజలకు హామీనివ్వాలని డిమాండ్‌ చేశారు.

600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే దివీస్‌లో వేలాది ఉద్యోగాలు వస్తాయనుకుంటే 3వేల ఉద్యోగాలే వస్తాయని చెబుతున్నారని వివరించారు. దాని కాలుష్యం వల్ల 300 హేచరీల్లో పనిచేసే 45 వేల మంది ఉపాధి దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. విశాఖలో గ్యాస్‌లీకేజీ ప్రమాద మృతులు ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.కోటి ప్రకటించారని, ఇక్కడ ఇంతగా ఉద్యమిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దివీస్‌ పరిశ్రమను ఆపేది లేదని, ఎవరు అడ్డొస్తారో చూస్తామని జగన్‌ సవాల్‌ చేస్తారా? లేదా అప్పట్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.

సాంకేతికతను అందిపుచ్చుకోలేరా?...


కాలుష్యం వెదజల్లుతుంటే కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తోందని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. వ్యర్థజలాలను శుద్ధి చేసే సాంకేతికతను అందిపుచ్చుకోలేరా? అని ప్రశ్నించారు. ‘పరిశ్రమల కాలుష్యానికి ప్రభుత్వమే పరిష్కారం కనుక్కోవాలి. కాలుష్య కారక పరిశ్రమ వద్దని ఆందోళన చేస్తే 160 మందిపై కేసులు పెట్టారు. చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రస్తుతం జైలులో ఉన్న 36 మంది అమాయకులపై ఉన్న కేసులను ఎత్తివేయాలి’ అని కోరారు. ఫ్యాక్షన్‌, హత్యలు చేసిన వారు, కోడికత్తితో దాడి చేసినవారు, చేయించుకున్నవారు బాగానే ఉన్నారని.. సొంత భూముల కోసం ఆందోళన చేస్తున్నవారు కేసుల్లో ఇరుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘దివీస్‌పై వ్యక్తిగత కోపం లేదు. జగన్‌, వైకాపా నా శత్రువులు కావు’ అని అన్నారు. ‘రోడ్డుపై పాదయాత్రలో ముద్దులు పెట్టడం కాదు.. ప్రజలపై ప్రేమ ఉండాలి. అది కాలుష్య రూపంలో కాదు’ అని పేర్కొన్నారు.

‘మాకు ఓట్లేసి గెలిపించారా? 25 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపారా? లేదు. ప్రజలు మా వెంట నిలబడకపోయినా సభలకు లక్షలాది జనం జేజేలు కొట్టినా, ఓట్లకు వచ్చేసరికి వేయకపోయినా సిద్ధాంతపరమైన రాజకీయాల వల్లే నిలబడ్డాం. మీరంతా మా కుటుంబం కాబట్టే పోరాడుతున్నాం’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ఆయన వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులున్నారు.

యిదేళ్లుగా ఎవరూ సంతోషంగా బతకడం లేదు. ఊరంతా ఆనందంగా ఉందనుకున్న సమయంలో అప్పట్లో చంద్రబాబు దివీస్‌ వస్తుందన్నారు. అప్పుడు అడ్డుకుంటానని భరోసానిచ్చిన జగన్‌ ఇప్పుడు పరిశ్రమ తెస్తామంటున్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా పోరాడి నేను అప్పట్లో 45 రోజులు అడవిలో దాక్కున్నా. ఇప్పుడు నా పిల్లలు 25 రోజులుగా జైల్లో ఉన్నారు. సగం చచ్చి, సగం బతికి మాట్లాడుతున్నాం. దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి ఇప్పుడు మమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే మా పిల్లల భవిష్యత్తుకు పది మందిమి కలిసి చనిపోవాలనుకుంటున్నాం.

ఇదీచదవండి

ఒంటిమామిడిలో జనసేన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

Last Updated : Jan 10, 2021, 4:23 AM IST

ABOUT THE AUTHOR

...view details