విద్యార్థులకు విద్యతోపాటు దేశభక్తి.... స్వాతంత్య్రం గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని హెచ్ఆర్డీఓ డీజీ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అచ్చంపేటలో శ్రీ చాగంటి సత్సంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తి ప్రబోధ కార్యక్రమం జరిగింది. దేశ భక్తులు, మహనీయుల త్యాగాల గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం అందించారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ ఛైర్మన్ వరపస్రాద్ రెడ్డి, కిరణ్ కంటి ఆసుపత్రి ఛైర్మన్ చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.
అచ్చంపేటలో ఘనంగా దేశభక్తి ప్రబోధ కార్యక్రమం - Patriotic Preaching Program in achampeta news
అచ్చంపేటలో శ్రీ చాగంటి సత్సంగ్ ఆధ్వర్యంలో దేశభక్తి ప్రబోధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్డీఓ డీజీ ఎల్వీ. సుబ్రమణ్యం, శాంతా బయోటెక్ ఛైర్మన్ వరపస్రాద్ రెడ్డి, చాగంటి కోటేశ్వరరావు, కిరణ్ కంటి ఆసుపత్రి ఛైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
దేశభక్తి ప్రబోధ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులతో పాటు విద్యార్థులు