తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ప్రభుత్వ సమాన్య వైద్యశాలలో కనీసం వైద్యం అందక ఒక మహిళ మృతి చెందింది. రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన 33ఏళ్ల శారద ఆనారోగ్యం కారణంగా తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. డబ్బులు లేక బుధవారం 11గంటల సమయంలో కుటుంబ సభ్యులు కాకినాడకు తరలించారు. అప్పటి నుంచి వైద్యులను ఎంత ప్రాథేయపడిన వారు చేయికూడా వేసి చూడలేదనీ... దాంతో శారద మృతి చెందిందని కుటుంభీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వైద్యుల నిర్లక్షాన్ని నిరసిస్తూ కాజువాలటీ వార్డు ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పేదవాళ్లు కావటంవల్లే పట్టించుకోలేదని వాపోతున్నారు. శారద మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వైద్యుల నిర్లక్ష్యం...మహిళ మృతి - doctores irresponsibility
వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేల ఫీజులు కట్టలేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన తమ చెల్లెలను కనీసం చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆఖరికి ప్రాణం తీశారంటుంది... ఆ తోబుట్టువు... ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సమాన్య వైద్యశాలలో చోటుచేసుకుంది.
వైద్యుల నిర్లక్ష్యంతో ...మహిళ మృతి