తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని ఓ గ్రామంలో సుధాకర్ అనే పాస్టర్.. స్థానికంగా ఉండే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై సర్పవరం పోలీసులు.. పాస్టర్ సుధాకర్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
పాస్టర్‌గా పనిచేస్తున్న కలవర సుధాకర్ అనే వ్యక్తి... జూన్ 22వ తేదీ మధ్యాహ్నం సమయంలో తను ఉండే కాలనీకి చెందిన బాలికను పశువుల పాకలోకి తీసుకుని వెళ్లాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక గట్టిగా ఏడవడంతో డబ్బులు ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్పవద్దన్నాడు. ఈవిషయం ఆలస్యంగా బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌ను అరెస్టు చేసి నిందితుడిపై ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు.