ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా గెలుపు ఖాయం.. బాబు మళ్లీ సీఎం అవుతారు' - కాకినాడ

క్రైస్తవ మత పెద్దల అభిమానం చూస్తుంటే.. మా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు కోరుకున్నట్లు 150 సీట్లకు పైగా గెలుచుకుని... ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి సునీల్.

పేదరిక నిర్మూలన చంద్రబాబుతోనే సాధ్యం

By

Published : Apr 2, 2019, 4:45 PM IST

పేదరిక నిర్మూలన చంద్రబాబుతోనే సాధ్యం
కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్థి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు క్రైస్తవ మత పెద్దలు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు విజయం సాధించడం ఖాయమని చెప్పారు. సుమారు 400 ప్రార్థనాలయాల పాస్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెదేపా అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, వనమాడి వెంకటేశ్వరరావు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం అందుకున్నారు. వారి అభిమానం చూస్తుంటే... చంద్రబాబు కోరుకున్నట్లు 150సీట్లకు పైగా గెలుచుకుని తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనిపిస్తోందని సునీల్ చెప్పారు. అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని వనమాడి తెలిపారు.

ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details