ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ - rtc employees strike in amalapuram news

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికుల సమ్మె వల్ల డిపో నుంచి బస్సులు కదలకపోవటంతో గమ్యస్థానాలకు చేరేందుకు అవస్థలు తప్పట్లేదు.

passengers
బస్టాండులో ప్రయాణికుల ఎదురుచూపులు

By

Published : Dec 1, 2020, 11:59 AM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో బస్సు సేవలు నిలిచిపోయాయి. నిత్యం వేలాది మంది ఈ డిపో నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రదేశాలకు రోజుకు 102 సర్వీసులు తిరుగుతాయి. అన్నీ ఒకేసారి నిలిచిపోయిన కారణంగా.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్​లో పడిగాపులు కాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details