ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమ్యూనిటి భవనానికి పార్టీ రంగులు...రైతు భరోసా కేంద్రంగా మార్పు - తూర్పు గోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం రంపలో గతంలో సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి స్వచ్ఛందంగా సామాజిక భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనానికి వైకాపా రంగులు వేసి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంగా మార్చింది. దీంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Party colors for community building ... Transformation into raithu bharosa kendram
కమ్యూనిటి భవనానికి పార్టీ రంగులు...రైతు భరోసా కేంద్రంగా మార్పు

By

Published : Oct 26, 2020, 11:51 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం రంప గ్రామంలో గిరిజనుల కోసం గతంలో సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి స్వచ్ఛందంగా సామాజిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో గ్రామస్థులు పలు కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో నారాయణమూర్తి చాలా చిత్రాలు తీయడంమే కాక పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భవనంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి.. పార్టీ రంగులు వేశారు. ఒక పక్క ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దని కోర్టు ఆదేశించినప్పటికీ, స్వచ్ఛందంగా ఇచ్చిన భవనానికి సైతం రంగులు వేయడంతో స్థానికులు అసంతృప్తితో వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details