ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమలాపురం డివిజన్​లో 66.20 శాతం పోలింగ్ - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లోని 16 మండలాల్లో 66.20 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్​లో యువకులు చురుగ్గా పాల్గొన్నారు.

పొలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
పొలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
author img

By

Published : Apr 9, 2021, 7:59 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్​లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 66.20 శాతం పోలింగ్ నమోదైంది.మొత్తం 8,76,253 ఓటర్లకు గాను 5,80,152 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కాట్రేనికోన మండలంలో యువకులు అత్యత్సాహంతో ఓటు వేసి... సెల్ఫీ తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మిగతా మూడు మండలాల్లోనూ ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది.

ఇదీ చదవండి: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 13 మంది ఖైదీలకు కరోనా

ABOUT THE AUTHOR

author-img

...view details