ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా లేదని తేలిన తరువాతే గ్రామానికి రండి' - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

కన్నప్రేమ కంటే బాధ్యత గొప్పదని భావించారు ఆ తల్లిదండ్రులు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరిన కుమారులను ఇంటికి రానివ్వలేదు. కరోనా లేదని తెలిన తరువాతే గ్రామంలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. స్వయంగా అధికారులకు ఫోన్​ చేసి వారిని క్వారంటైన్​కి పంపారు.

parents send their sons to quarantine in east godavari district
parents send their sons to quarantine in east godavari district

By

Published : Apr 21, 2020, 5:30 PM IST

'కరోనా లేదని తేలిన తరువాతే గ్రామానికి రండి'

లాక్​డౌన్ ఉన్నా ఎంతో కష్టపడి మహారాష్ట్ర నుంచి స్వస్థలానికి వచ్చారు ఆ యువకులు. ఆనందంగా ఇంటికి వెళ్తున్న యువకులకు వారి తల్లిదండ్రులు షాక్ ఇచ్చారు. కరోనా లేదని తేలిన తరువాతే గ్రామంలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి, ఉత్తరకంచి గ్రామాలకు చెందిన నలుగురు యువకులు ఉపాధి కోసం మహారాష్ట్రలో ఉంటున్నారు. లాక్​డౌన్​ విధించటంతో అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరారు. వివిధ మార్గాల ద్వారా మూడు రోజులు ప్రయాణించి ప్రత్తిపాడు చేరుకున్నారు. సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు... యువకులను ప్రత్తిపాడులోనే ఉంచి బాధ్యతగా అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం ఆ నలుగురిని అన్నవరం క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details