ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..? - protest in front of hospital news

కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని కురసాంపేట గ్రామానికి చెందిన మహిళకు పుట్టిన బిడ్డ మరణించింది. అందుకు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ పాప తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

protest in front of hospital
ఆస్పత్రి ఎదుట మృతి చెందిన పాప తల్లిదండ్రుల నిరసన

By

Published : Dec 25, 2020, 10:06 PM IST

యానాంలోని కురసాంపేటకు చెందిన మహిళకు తొలి కాన్పులో పుట్టిన శిశువు మరణించింది. డెలివరి కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా..వైద్యుల పర్యవేక్షణలో పాపకు జన్మనిచ్చింది. కానీ బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ సర్కారు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది.

యానాం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణంగానే పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. అనుభవం లేని డాక్టర్ల వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించి..ఉన్నతాధికారులకు అందించారు.

ABOUT THE AUTHOR

...view details