పోలవరం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి ఆలయం వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పాపికొండలు పర్యాటకాన్ని మంత్రి పునఃప్రారంభించారు. గోదావరికి పూజలు నిర్వహించి హారతిచ్చారు. బోటుపై ఆయన పూడిపల్లి వరకు వెళ్లారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి విహారయాత్రను నిలిపివేశారు.
PAPIKONDALU TOUR: పాపికొండలు విహారయాత్ర పునఃప్రారంభం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
పాపికొండలు విహారయత్రకి వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. 21నెలల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పాపికొండల విహారయాత్రని పునఃప్రారంభించంది. పోచమ్మగండి వద్ద గోదావరికి పూజలు చేసిన అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యాత్రను ప్రారంభించారు.
![PAPIKONDALU TOUR: పాపికొండలు విహారయాత్ర పునఃప్రారంభం papikondalu toor Restarted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12329434-52-12329434-1625192695116.jpg)
పాపికొండలు పర్యాటకం పునఃప్రారంభం
పాపికొండలు పర్యాటకం పునఃప్రారంభం