ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Papikondalu: పునఃప్రారంభమైన పాపికొండలు విహారయాత్ర - పాపికొండలు విహారయాత్ర తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో జరిగిన పడప ప్రమాదం జరిగిన రెండేళ్ల తర్వాత.. పాపికొండలు విహారయాత్ర ప్రారంభమైంది. ఏపీ పర్యాటక శాఖకు చెందిన పడవ పర్యాటకులతో.. ఇవాళ ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు పాపికొండలు చేరుకుంది.

papikondalu excursion restarted after two years
పునఃప్రారంభమైన పాపికొండలు విహారయాత్ర

By

Published : Jul 4, 2021, 9:03 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి దేవీపట్నం మండలం పోచమ్మ గండి మీదుగా పాపికొండలు విహార యాత్ర పునఃప్రారంభమైంది. కచ్చులూరులో జరిగిన పడవ ప్రమాదం తర్వాత పాపికొండలు విహార యాత్ర నిలిచిపోయింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఆదివారం నుంచి పర్యాటకుల విహారయాత్ర ప్రారంభమైంది. ఏపీ పర్యాటక శాఖకు చెందిన పడవ.. పర్యాటకులతో ఇవాళ ఉదయం 7 గంటలకు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి 9 గంటలకు పోచమ్మ గండి వద్దకు చేరుకుంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు పాపికొండలు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాణమైన పడవ.. సాయంత్రం 5.30 గంటలకు పోచమ్మ గండికి చేరుకుంది. యాత్రలో ఎలాంటి ప్రమాదం జరగకుండా.. నిపుణులైన డ్రైవర్​తో పాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details