తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెం మార్కెట్లో విక్రయానికి వచ్చిన ఓ భారీ చేప అందరినీ ఆకట్టుకుంది. సుమారు 300 కిలోల బరువున్న ఆ చేపను పండుగప్ప చేప అంటారు. చేపల వ్యాపారులు పంతాడ విశ్వనాథం, రాజు, విజయ్.. ఈ చేపను విక్రయించేందుకు కొమరిపాలెంలోని చేపల మార్కెట్టుకు తీసుకొని వచ్చారు.
చేప విషయం ఆనోటా ఈ నోటా స్థానికులకు తెలిసింది. దాన్ని చూసేందుకు చాలామంది మార్కెట్ కు తరలివచ్చారు. ఇలాంటి అరుదైన చేపలు చిక్కడం చాలా అరుదని మత్స్యకారులు చెప్పారు. సుమారు 30 వేల రూపాయలకు ఈ భారీ చేప అమ్ముడైనట్టుగా అక్కడి వ్యాపారులు తెలిపారు.