తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు డివిజనల్ పంచాయతీ అధికారి తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా 273 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని పేర్కొన్నారు.
21న పంచాయతీ ఎన్నికలకు.. అధికారుల ఏర్పాట్లు - అమలాపురం డివిజన్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ న్యూస్
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో ఈ నెల 21న నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అందుకోసం నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 నుంచి జరగనుందని డివిజనల్ పంచాయతీ అధికారి తెలిపారు.
'ఈ నెల 10 నుంచి నామినేషన్ స్వీకరణ కార్యక్రమం'