కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై హరీష్ కుమార్.. నడి రోడ్డుపై భారత దేశ చిత్రాన్ని వేయించారు. స్టే హోమ్ సేవ్ లైఫ్ సేఫ్ ఇండియా అంటూ సందేశాత్మకంగా నినాదాలు రాయించారు. మూడు రహదారుల కూడలిలో ఈ చక్కటి చిత్రాన్ని వేశారు. జనాన్ని ఆలోచింపజేశారు.
కరోనాపై పి.గన్నవరం పోలీసుల సందేశం - కరోనాపై పి. గన్నవరం పోలీసుల సందేశం
ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో పోలీసులు ఎప్పటికప్పడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్తగా పి. గన్నవరం పోలీసులు రోడ్డుపై భారదదేశ చిత్ర పటం చిత్రించారు. ప్రజలను ఇంటి వద్దే ఉండి దేశాన్ని కాపాడాలంటూ నినాదాలు రాయించారు.
![కరోనాపై పి.గన్నవరం పోలీసుల సందేశం p gannavaram police gave meesage to people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6733467-668-6733467-1586496576202.jpg)
కరోనాపై పి. గన్నవరం పోలీసుల ప్రచారం