తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ పీఠం కోసం రసవత్తర పోరు మొదలైంది. మొత్తం 22 ఎంపీటీసీల్లో వైకాపా 9, తెదేపా 7, జనసేన 5, బీఎస్పీ 1 చోట్ల గెలుపొందాయి. ఎన్నికల సమయంలో తెదేపా, జనసేన మధ్య పరస్పర అవగాహన కుదిరింది దీని ప్రకారం ఇరు పార్టీల అభ్యర్థులు చెరో రెండున్నరేళ్లు ఎంపీపీ పదవిలో కొనసాగనున్నారు. అయితే అధ్యక్ష పీఠం మొదటి రెండున్నరేళ్లు తమకే కావాలంటూ తెదేపా, జనసేన పట్టు పడుతుండడంతో కాస్తంత ఉత్కంఠ నెలకొంది.
మొదటి రెండున్నరేళ్లు మాకు.. కాదు మాకే.. పార్టీల మధ్య ఉత్కంఠ - east godavari latest news
పి.గన్నవరం ఎంపీపీ పీఠం కోసం రసవత్తర పోరు జరుగుతోంది. ఎన్నికల సమయంలోనే తెదేపా, జనసేన మధ్య అవగాహన కుదిరినప్పటికీ మొదటి రెండున్నరేళ్ల కోసం ఇరు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు.
Alchemical fight for Gannavaram MP pedestal