తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావులలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారంటూ కొనియాడారు. దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేసిన మహానీయుడు అన్నారు.
'దళితుల రాజకీయ సాధికారతకు కృషి చేసిన జగ్జీవన్ రామ్' - పి గన్నవరం ఎమ్మెల్యే తాజా వార్తలు
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నివాళి అర్పించారు. బాబూ విగ్రహానికి పూలమాలలు వేశారు.
బాబు జగజ్జీవన్ రామ్‌కు నివాళి అర్పిస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే