పి.గన్నవరంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి శిక్షణ - Employment Guarantee Scheme Training for staff
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామ్ పథకంలో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ తరగతి నిర్వహించారు.
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో శిక్షణ తరగతి నిర్వహించారు. కోనసీమలోని 16 మండలాలతోపాటు తాళ్లరేవు మండలంలో 17 మండలాలకు చెందిన ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఇంజినీర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. భువన్..గూగుల్ ఎర్త్ ప్రో సాఫ్ట్ వేర్లపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ సాఫ్ట్‌వేర్‌లో పనులను ఏ విధంగా ఫీలింగ్ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. వీటి ద్వారా పనులలో పారదర్శకత ఏర్పడుతుందని శిక్షకులు వివరించారు.