తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తొట్టరమూడి గ్రామ మహిళలు.. తమ ప్రాంతంలోని మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. మండలంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మందుబాబులు జై భీమ్ నగర్లోని మద్యం దుకాణం వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారని.. ఈ కారణంగా కరోనా ప్రభావం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతానికి తమ గ్రామంలో కరోనా కేసులు లేవని... కానీ మద్యం దుకాణాల వల్ల వచ్చే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందారు.