ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

50 ఆక్సిజన్ సిలిండర్లు అందించిన చమురు సంస్థ - corona news

కరోనా రోగుల ప్రాణవాయువు అవసరాలకు ఉపయోగపడేలా.. ఆక్సిజన్ సిలిండర్లను తూర్పు గోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ అందించింది. ఇటువంటి సేవాకార్యక్రమాలతో దాతలు ముందుకు రావాలని మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు.

oxygen cylinders donation by private company
'50' ఆక్సిజన్ సిలిండర్లు అందించిన చమురు సంస్థ
author img

By

Published : Jun 2, 2021, 5:42 PM IST

కొవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా సురసానియానం గ్రామంలోని చమురు సంస్థ.. రవ్వ జాయింట్ వెంచర్స్ 50 ఆక్సిజన్ సిలిండర్లను అందించేందుకు ముందుకొచ్చింది.

వీటిని సంస్థ ప్రతినిధులు మంత్రి విశ్వరూప్​కు అందజేశారు. వీటిలో 30 సిలిండర్లను అమలాపురంలోని ఏరియా ఆసుపత్రికి, మిగిలిన 20 సిలిండర్లను సురసానియానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details