కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పలువురు దాతలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారు. రావులపాలెంలోని చిర్ల సోమసుందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్టుకు అవంతి సీ ఫుడ్స్ లిమిటెడ్ రూ.2 లక్షల విలువగల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడాల పరమారెడ్డి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ట్రస్టుకు అందించారు. వీటిని గోపాలపురంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి దాతలు అందజేశారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన దాతలు - రావులపాలెంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సాయం
కరోనా వ్యాప్తివేళ బాధితుల ప్రాణాలు కాపాడటానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో పలువురు దాతలు చిర్ల సోమసుందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్టుకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించారు.
![ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన దాతలు ravulapalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:26:24:1622037384-ap-rjy-56-26-sayam-av-ap10018-26052021182535-2605f-1622033735-447.jpg)
రావులపాలెంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సాయం