తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని భద్రవరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నరాజు కుటుంబం సర్వం కోల్పోయింది. ఏడాదిన్నరగా కుమారుడి గుండె వైద్యం కోసం దాచుకున్న నాలుగు లక్షల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయి. స్పందించిన శ్రీ విద్య పాఠశాల యాజమాన్యం ఆ బాలుడి వైద్యానికి 46 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. అంతేగాక బాధితుడి సోదరునికి యూనిఫామ్, ఈ విద్యా సంవత్సరం ఫీజును మాఫీ చేయడం జరిగిందని పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తిరగటి వీరవేణి, ప్రిన్సిపల్ తిరగటి దమయంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దాతృత్వం చాటిన శ్రీ విద్య పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు - ఏలేశ్వరం శ్రీ విద్యా పాఠశాల
ఏలేశ్వరం మండలంలోని భద్రవరం గ్రామంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివరామకృష్ణ అనే బాలుడికి శ్రీ విద్య పాఠశాల యాజమాన్యం 46 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. బాధితుడి సోదరుడికి స్కూల్ యూనిఫామ్, విద్యాసంవత్సరం ఫీజును మాఫీ చేశారు.
ఆర్థిక సాయాన్ని అందిస్తున్న పాఠశాల యాజమాన్యం