ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతానగరం ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు - ఏపీలో ఎస్సీ యువకుడికి గుండు చేయించిన పోలీసులు న్యూస్

తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడికి జరిగిన అవమానంపై పార్టీల నేతలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ముమ్మాటికి ప్రభుత్వం చేపట్టే దుశ్చర్యల్లో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తాయి. సస్పెన్షన్​లతో సరిపెట్టద్దని డిమాండ్​ చేశారు.

ఎస్సీ యువకుడి ఆత్మగౌరవాన్ని నాశనం చేశారు!
ఎస్సీ యువకుడి ఆత్మగౌరవాన్ని నాశనం చేశారు!

By

Published : Jul 21, 2020, 8:16 PM IST

రాష్ట్రంలో అనాగరిక పాలన: చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసు స్టేషన్​లో ఓ యువకుడికి శిరోముండనం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ అనాగరిక పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక పార్టీ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా ఎందుకు మారారని ప్రశ్నించారు. ఎస్సీ యువకుడి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తూ చావబాది శిరోముండనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు ప్రశ్నించడం ఆ కుర్రాడు చేసిన తప్పా అని నిలదీశారు. ఆ కుర్రాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ అనాగరిక చర్యకు కారణమైన వారికి కఠినంగా శిక్షపడేవరకు పోరాడుతుందన్నారు.

24 గంటల గడువు : హర్షకుమార్

ఎస్సీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం...పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేయిస్తుందా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ హర్షకుమార్. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారాయన. ఎస్‌ఐను సస్పెండ్ చేసినంత మాత్రాన సరిపోదన్నారు. బాధ్యులైన అందరినీ సస్పెండ్‌ చేయాలన్నారు. 4 రోజులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన బాలికకు న్యాయం చేయలేదని ఇంతలోనే మరో వ్యక్తికి అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ ప్రజాప్రతినిధులు, హోంమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇది అవమానమన్నారు హర్షకుమార్. ఎస్సీలను కచ్చితంగా అణిచివేయాలనే ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

పెయిడ్ బ్యాచ్‌లను ప్రభుత్వం డబ్బులిచ్చి పోషిస్తోందని విమర్శించారు. పార్టీల ముసుగులు వదిలేసి అందరూ ఇలాంటి ఘటనలను ఖండించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. 24 గంటల్లో పోలీసు అధికారులపై, సూత్రధారులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

పెచ్చరిల్లిపోతున్న ఇసుక మాఫియా: రామకృష్ణ

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం మాఫీయా కోసమేనన్నారు సీపీఐ నేత రామకృష్ణ. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఇసుక మాఫియా పెచ్చరిల్లిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.వెయ్యి కోట్ల మేర ఇసుక దందా జరిగిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చన్నారు. ఇసుక లారీలను అడ్డుకున్న ఎస్సీ యువకుడిని కారుతో ఢీకొట్టడం అమానుషమన్నారు. పోలీసులే ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఘటనకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో: వరప్రసాద్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details