ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో పోలీసుల ఓపెన్ హౌస్ - కాకినాడలో పోలీసుల ఓపెన్ హౌస్ వార్తలు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ నయీం అస్మీ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పట్ల అవగాహన కల్పించామని అన్నారు.

Open House in Kakinada
కాకినాడలో పోలీసుల ఓపెన్ హౌస్

By

Published : Oct 28, 2020, 10:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, ఏఎస్పీ కరణం కుమార్ ఓపెన్ హౌస్​లో పాల్గొన్నారు. విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పట్ల అవగాహన కల్పించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు నేర దర్యాప్తు విధానం వివరించారు. రైట్‌ గేర్‌ ‌, సాంకేతికతలో భాగంగా ఉపయోగించే బాడీ వార్మ్ కెమెరాల పనితీరును విద్యార్థులకు తెలియజేశారు.

డ్రోన్ కెమెరా, ఫాల్కన్ వాహనం, హాక్ వాహనం, 207 వజ్ర వాహనం, రేస్ వాహనాలు, మెటల్ డిటెక్టర్ , డ్రాగన్ లైట్, రాకర్, బాంబు డిస్పోజబుల్ పరికరాలు, ఫింగర్ ప్రింట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్వ్కాడ్ బృందాలు, సెల్ ఫోన్ జామర్ల పనితీరు వివరించారు. ఏకే 47, 9 ఎంఎం గ్లాక్ పిస్టల్, 303 ఎల్‌ఎంజీ (లైట్ మెషిన్ గన్) , 7.62 ఎంఎం ఎస్‌ఎల్ఆర్, జీఎఫ్ రైఫిల్, ఫెడరల్ గ్యాస్ గన్, ట్రంచెన్ పిస్టల్, రియల్ పిస్టల్, 455 రివాల్వర్ లపై అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details