ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న లెక్కింపు... ఫలితం కోసం అభ్యర్థుల ఎదురుచూపులు - ఆలూరు మండలం పరిధిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు న్యూస్

తూర్పుగోదావరి జిల్లా ఆలూరు మండలం పరిధిలోని పదహారు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా వార్డు మెంబర్లకు పోలైన ఓట్ల లెక్కింపు కారణంగా.. సర్పంచ్​ ఫలితాలు ఆలస్యం కానున్నాయి. తమ అభ్యర్థుల విజయం కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Ongoing counting of votes in Aluru zone of East Godavari district
కొనసాగుతున్న లెక్కింపు... విజయం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు...

By

Published : Feb 9, 2021, 9:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలూరు మండలం పరిధిలోని పదహారు పంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. 62,123 మంది ఓటర్లకు గాను 51,038 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా చొల్లంగి పంచాయతీలో 92.88 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా తాళ్లరేవులో 74.48 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి విజయ్ థామస్ తెలిపారు. 198 వార్డు మెంబర్లకు జరిగిన ఈ ఎన్నికల్లో 82.16 శాతం పోలింగ్ నమోదయినట్లు పేర్కొన్నారు.

మేజర్ పంచాయతీలైన గాడిమొగ, కోరంగి, తాళ్ళరేవు, పటవలలో అభ్యర్థులు పాగా వేసేందుకు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత సమస్యాత్మకమైన గాడిమొగ పంచాయతీ ఓట్లు లెక్కింపును సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. అక్కడి ప్రక్రియను జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు అరుణ్ కుమార్ పరిశీలిస్తున్నారు.

ముందుగా వార్డు మెంబర్లకు పోలైన ఓట్ల లెక్కింపు కారణంగా.. సర్పంచ్​ ఫలితాలు ఆలస్యం కానున్నాయి. తమ అభ్యర్థులు విజయం కోసం లెక్కింపు కేంద్రాల వద్ద కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి ఫలితంలో సుంకరపాలెం పంచాయితీ సర్పంచిగా టిల్లపూడి నాగేశ్వరరావు విజయం సాధించారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details