ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న బోటు వెలికితీత పనులు ! - కుచ్చులూరు బోటు ప్రమాదం తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. నిన్న యాంకర్​కు చిక్కిన బోటు పట్టు సడలించటంతో....నదిలోపలకి వెళ్లి బోటుకు కొక్కేలు బిగించే ప్రయత్నం చేయాలని సత్యం బృదం భావిస్తోంది.

కొనసాగుతున్న బోటు వెలికితీత పనులు !

By

Published : Oct 19, 2019, 6:07 PM IST

గోదావరిలో మునిగిన బోటు చిక్కినట్లే చిక్కి దూరమవుతోంది. నిన్న లంగరుకు చిక్కిన బోటు పట్టు తప్పడంతో నీటిలోనే ఉండిపోయింది. బోటు ఒడ్డుకు చేరకపోయినా..... సుమారు 75 అడుగులు ముందుకు కదిలిందని ధర్మాడి సత్యం బృందం తెలిపింది. నీటిలో ఇసుక మేటలు, మట్టిదిబ్బలు ఉండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. . నది లోపలకి వెళ్లి బోటుకు కొక్కేలు బిగిస్తే బోటు బయటకు వచ్చే అవశాశం ఉండటంతో ఈ మేరకు...చర్యలు చేపట్టారు. విశాఖ నుంచి డీప్ డైవర్లను రప్పించే ప్రయత్నాలను మెుదలుపెట్టారు.

కొనసాగుతున్న బోటు వెలికితీత పనులు !
ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details