తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు శివారులోని ఏటిగట్టు సమీపంలోని పంట పొలంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైను శుక్రవారం మధ్యాహ్నం లీకైంది. గ్యాస్‌తో కూడిన ముడి చమురు తెట్టు బయటకు ఎగజిమ్మింది. పాశర్లపూడి క్షేత్ర పరిధిలోని బావి నుంచి తాటిపాక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్‌కు ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలను సరఫరా చేసే పైపునకు రంధ్రం పడటంతో ఈ లీకేజీ ఏర్పడింది. స్థానికులు గుర్తించి.. వెంటనే సంబంధిత జీసీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక సిబ్బంది బావి వద్ద సరఫరాను నిలిపివేశారు. అక్కడి లీకేజీని పరిశీలించి మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వారు చెప్పారు.
మామిడికుదురు సమీపంలో ఓఎన్జీసీ పైపులైన్ లీక్ - పైపులైను నుంచి చమురు లీక్
ఓఎన్‌జీసీ పైపులైను లీక్
16:45 October 08
ONGC - BREAKING
Last Updated : Oct 9, 2021, 1:15 PM IST