ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాల ప్రజలకు.. ఓఎన్జీసీ సంస్థ అండగా నిలిచింది. పేదలను ఆదుకోవాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు చేసిన విజ్ఞప్తికి సంస్థ స్పందించింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలతో పాటు యానాంలోని నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచింది. గ్రామాలు తిరుగుతూ సుమారు లక్ష కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. ఓఎన్జీసీ అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - ongc officers essential goods distribution news
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పారిశ్రామిక సంస్థలను కోరగా... ఓఎన్జీసీ అధికారులు స్పందించారు. తమ వంతు సాయంగా సుమారు లక్ష కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ముందుకొచ్చారు.
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఓఎన్జీసీ అధికారులు