ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Yanam: కరోనా తొలి కేసు నమోదై నేటికి ఏడాది - corona cases in Yanam

యానాంలో కరోనా తొలి కేసు నమోదై నేటికి ఏడాది పూర్తయింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో పదిహేను రోజుల్లోపు కోలుకున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో 28 మంది, ఇంటివద్ద ఉండి 48 మంది చికిత్స పొందుతున్నారని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికి 16,500 మందికి టీకాలు వేసినట్టు వెల్లడించారు.

కరోనా తొలి కేసు నమోదై నేటికి ఏడాది
కరోనా తొలి కేసు నమోదై నేటికి ఏడాది

By

Published : Jun 20, 2021, 10:52 PM IST

కేంద్రపాలిత యానాంలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తయింది. హైదరాబాద్​కు చెందిన దంపతులు తమ 12 ఏళ్ల కుమారుడిని వారి తల్లిదండ్రుల వద్ద వదిలివెళ్లిన వారం రోజుల తర్వాత బాలుడిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో పదిహేను రోజుల్లోపు కోలుకున్నాడు. అలా మొదలైన సంఖ్య నెలరోజులకు 100కు చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు యానాం నుంచి బయటకు వెళ్లకుండా, ఇతరులెవరూ యానాంలోకి రాకుండా చర్యలు చేపట్టగా... రోజువారి కేసుల సంఖ్య తగ్గింది.

అప్పటి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పీపీఈ కిట్టు ధరించి వార్డులో చికిత్స పొందుతున్న రోగులు వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని వారికి మనోధైర్యం అందించేవారు. హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి అవసరమైన సరకులు, ఆహారాన్ని స్వచ్ఛంద సంస్థ ద్వారా అందించేవారు. 2021 జనవరిలో పండగలు, ఇతర శుభకార్యాలతో పాటు ఏప్రిల్​లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. దీంతో రోజువారి కేసుల సంఖ్య ఒక్కసారిగా 200కు చేరుకుంది.

ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో 28 మంది, ఇంటివద్ద ఉండి 48 మంది చికిత్స పొందుతున్నారని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రోజువారి కేసుల సంఖ్య 10లోపు ఉంటున్నాయని, వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తున్నామని వివరించారు. ఇప్పటికి 16,500 మందికి టీకాలు వేసినట్టు వెల్లడించారు. ఆగస్టు నాటికి 90 శాతం పూర్తిచేసే ప్రణాళికలు వేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ... Gang Rape: కాబోయే భర్తను తాళ్లతో కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details