ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ONE RUPEE TIFFIN: ఆ హోటల్​లో రూపాయికే అల్పాహారం..ఎక్కడంటే - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

కాకా హోటల్‌కు వెళ్లినా.. కనీసం 20 రూపాయలు లేనిదే ప్లేట్ ఇడ్లీ(IDLY STORY) దొరకదు. ప్రాంతాన్ని బట్టి ప్లేట్‌ ఇడ్లీ పాతిక నుంచి 50 రూపాయల వరకు ఉంటోంది. తక్కువలో తక్కువ అనుకున్నా పాతిక రూపాయలు లేనిదే ప్లేట్‌ ఇడ్లీ తినలేం. కానీ... తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో రూపాయికే ఇడ్లీ, బజ్జీ అందిస్తూ ఓ కుటుంబం అందరీ కడుపు నింపుతోంది.

ఆ కాకా హోటల్లో రూపాయికే ఇడ్లీ!
ఆ కాకా హోటల్లో రూపాయికే ఇడ్లీ!

By

Published : Oct 7, 2021, 5:59 PM IST

ఆ కాకా హోటల్లో రూపాయికే ఇడ్లీ!

నిత్యావసరాల ధరలు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో సాధారణ హోటళ్లలోనే జేబుకు చిల్లు తప్పడం లేదు..! అదే కాస్త పెద్ద హోటళ్లలో అయితే.. ధరలు పెరుగుతూపోవడమే తప్ప తగ్గేది లేదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కాకా హోటల్‌(ONE RUPEE IDLY)లో మాత్రం పేదలకు అందుబాటు ధరలో కడుపు నింపుతోంది.

ఎవరైనా సరే అటువైపు వెళ్తున్న వారు ఈ హోటల్ దగ్గర ఠక్కున ఆగిపోతారు. పెద్దాపురం మండలం ఆర్​.బీ కొత్తూరులో చిన్ని రామకృష్ణ, చిన్ని రత్నం లక్ష్మి దంపతులు హోటల్ నడుపుతున్నారు. 16 ఏళ్లుగా ప్లేటు ఇడ్లీ, బజ్జీ రూపాయి చొప్పున అందిస్తున్నారు. ఈ దంపతులతో పాటు రత్నం లక్ష్మీ తల్లి, అత్తయ్య ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్ నిర్వహిస్తారు.

"నిత్యావసర ధరలు మండుతున్నా... రూపాయికి ఇంకో రూపాయి పెంచలేదు. డబ్బు సంపాదనే కాదు... సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నాం... తెల్లారిందంటే చాలు మా హోటల్‌కు జనం క్యూ కడతారు" -చిన్ని రామకృష్ణ దంపతులు

అన్ని ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో రూపాయికే ఇడ్లీ, బజ్జీలు ఇవ్వడమంటే ఎంతో గొప్ప విషయమని అక్కడ టిఫిన్​ చేసినవాళ్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

విశాఖకు మోడల్ ఫిషింగ్ హార్బర్ : కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్

ABOUT THE AUTHOR

...view details