తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఉచ్చులవారిపేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో 53 కుటుంబాలను కంటెయిన్మెంట్లో ఉంచినట్లు ఎస్సై జి.సురేంద్ర వెల్లడించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. పంచాయతీ సిబ్బంది గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది నివారణం చర్యలు చేపట్టారు.
ఉచ్చులవారిపేటలో కరోనా పాజిటివ్.. కంటెయిన్మెంట్ జోన్లోకి 53 కుటుంబాలు - తూర్పు గోదావరి జిల్లా కరోనా కేసుల వివరాలు
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఉచ్చుల వారి పేటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడం అప్రమత్తమైన అధికారులు 53 కుటుంబాలను కంటెయిన్మెంట్ జోన్లో ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా నిర్ధరణ కావడం స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఉచ్చులవారిపేటలో కరోనా పాజిటివ్
రాజుల ఏనుగుపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి వైద్య సేవలు అందించి ఇరవై రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ముగ్గురికి నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు వైద్యాధికారి కే.సుబ్బరాజు వెల్లడించారు. మండలంలో క్రమేపీ కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.