ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మమ్మ బంగారం... తీసింది ప్రాణం.... - unidentifised persons

అమ్మమ్మ ఇచ్చిన బంగారం పంచుకునే విషయంలో చోటుచేసుకున్న చిన్న తగాదా.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

one men died by unidentifised persons hit on head at prattipadu in east godavari district one men died by unidentifised persons hit on head at prattipadu in east godavari district

By

Published : Aug 22, 2019, 2:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బర్ల సత్తిబాబు అనే యువకుడు హత్యకు గురయ్యాడు. డీఎస్పీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అమ్మమ్మ ఇచ్చిన బంగారం పంచుకునే విషయంలో సత్తిబాబుకి చిన్నమ్మ కుమారుడు శివతో గొడవ ఏర్పడింది. ఈ గొడవ కారణంగా శివ ముందుగా వేసిన పథకం ప్రకారమే గతరాత్రి అన్న సత్తిబాబును బయటికి రప్పించి కర్రతో కొట్టి హత్యచేశాడు. తన మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

పొతులూరులో వ్యక్తి దారుణహాత్య..

ABOUT THE AUTHOR

...view details