తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రామచంద్రపురం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఓ రైతు, యువకుడి వాహనాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రైతు యువకుణ్ని కొట్టడంతో స్వల్పంగా గాయపడ్డాడు. దీనిపై యువకుడు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనను రైతు కులం పేరుతో దూషించాడని యువకుడు ఆరోపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు - తూర్పుగోదావరి వార్తలు
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని రామచంద్రాపురం వద్ద జరిగిన ఘటన వివరాలివి..!
వాహనాలు ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ