తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మూలస్థాన అగ్రహారానికి చెందిన రేలంగి నాగేశ్వరరావు, అల్లం గంగారావులు మోటార్ సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా...రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా... గంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి - కారు, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి
తూర్పుగోదావరి జిల్లా చొప్పెల్ల జాతీయరహదారిపై...కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా...మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కారు, ద్విచక్రవాహనం ఢీ...ఒకరు మృతి