సాధారణంగా వీధికుక్కలను చూస్తే ఎవరైనా అసహ్యించుకుంటారు. వాటిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వరు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేపర్ మిల్లు సమీపంలో ఉన్న శ్రీరామ్ నగర్‌కు చెందిన రాజు... వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటాడు. అయితే అతను కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ వీధిలో ఉన్న ఓ కుక్క ఆటోలో 8 పిల్లలకు జన్మనిచ్చింది. ఎవరో ఆటోలో నుంచి ఆ పిల్లలను కిందకు దించేశారు. దీంతో... ఆ కుక్క తన పిల్లలను రక్షించుకోవటానికి తుప్పల్లోకి తీసుకెళ్లింది. కానీ ఆ చిట్టి కూనలకు చీమలు కుట్టటంతో కూని రాగాలు తీస్తుండగా.. గమనించిన రాజు ఆ బుజ్జి పిల్లలకు హాని జరగకుండా వీధిలోని ఓ చెట్టు కింద చాపవేసి దానిపైన అనువుగా గూడు ఏర్పాటు చేశాడు. వాటి ఆలనా పాలనా చూసుకుంటూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు.
మానవత్వపు గూడు.. బుజ్జి కూనలకు చేదోడు
వీధి కుక్కలంటే మనకు చాలా చిరాకనిపిస్తుంది. వాటికి అన్నం పెట్టడం కాదు కదా... కనీసం మన ఇంటివైపే రానివ్వం.. కానీ రాజమహేంద్రవరంలోని ఓ వ్యక్తి చేసిన పని చూస్తే.. భలే చేశావ్ అని అభినందిస్తారు.
మానవత్వం చాటుకున్నావ్ అన్నా..!