తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడియం మండలం సావరం గ్రామానికి చెందిన జ్యోతుల అర్జున్ మృతిచెందాడు. అర్జున్ మేన కోడలికి వివాహం కుదిరింది. మొదటి శుభలేఖను పెళ్లి కుమారుడుకి ఇచ్చేందుకు అర్జున్ పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లిలోని పెళ్లి కుమారుడి ఇంటికి ...జ్యోతుల వేణు, ఆదిలక్ష్మి, కర్రీ వీర్రాజులతో కలిసి ఆటోలో వెళ్లారు. జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి ఒక కారు వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికూతురి మేనమామ అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మేనకోడలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లి...ఓ వ్యక్తి మృతి
కొన్ని రోజుల్లో వివాహం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. మేనకోడలి పెళ్లి ఎంతో వైభవంగా జరిపించాలని... మొదటి శుభలేఖ పెళ్లి కుమారుడికి ఇచ్చేందుకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన జ్యోతుల అర్జున్
TAGGED:
రావులపాడులో రోడ్డు ప్రమాదం