ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు టైరు పేలి... పింగాణీ వ్యాపారి మృతి - బెండపూడి కారు యాక్సిడెంట్ వార్తలు

పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చి... రోడ్డు పక్కన పింగాణీ సామగ్రి అమ్ముకునే వారిపై విధి కన్నెర్ర చేసింది. కారు రూపంలో ఒకరిని కబళించింది. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా బెండపూడి జాతీయ రహదారి వద్ద జరిగింది.

one died
కారు టైరు పేలి... పింగాణీ వ్యాపారి మృతి

By

Published : Mar 13, 2021, 1:02 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి వద్ద.. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు టైరు పేలడంతో... రహదారి పక్కనే పింగాణీ సామగ్రి అమ్మే వ్యాపారులపైకి దూసుకుపోయి గోతిలో పడింది.

ఘటనలో ఒక వ్యాపారి మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయపడ్డారు. మృతుడిని రాజస్థాన్​కి చెందిన సంచార జీవి పప్పు లాల్​గా గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details