తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం జలాశయం మలుపు వద్ద కారు లారీని ఢీ కొట్టిన ఘటనలో.. ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. అనపర్తి మండలం పాలమూరుకి చెందిన గుత్తుల శ్రీను, రామవరం గ్రామానికి చెందిన సత్తి లక్ష్మీ నారాయణ, పడాల సత్యనారాయణరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి తెలంగాణలోని భద్రాద్రి జిల్లా మణుగూరుకి వెళ్లి తిరిగి వస్తున్నారు. భూపతిపాలెం జలాశయం మలుపు వద్దకు వచ్చేసరికి.. ఛత్తీస్ఘడ్కి చెందిన లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుత్తుల శ్రీను అక్కడిక్కడే మృతి చెందగా.. సత్తి లక్ష్మీ నారాయణరెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. బాధితులిద్దరినీ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రికి తరలించారు.
లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం - భూపతిపాలెం జలాశయం వద్ద ప్రమాదం న్యూస్
తూర్పు గోదావరి జిల్లా భూపతిపాలెం జలాశయం మలుపు వద్ద కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
లారీని ఢీ కొట్టిన కారు